మహానుభావులు ఊరకనే రారు అన్న చందాన ప్రపంచ మేధావులు సంఘ సంస్కర్తలు పుట్టుకొస్తుంటారు. వారిలో చెప్పుకోదగిన వారు పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యగారు. అయన పూర్తి పేరు దరిపల్లి రామయ్య. ఎన్నో రహదారుల వెంబడి అయన మొక్కలను నాటి సంరక్షించాడు. అప్పట్లో ఆయన్ను పిచోడు అన్నారు...భారత ప్రభుత్వం ఆయన్ను గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది.

 

 మహారాష్ట్ర ప్రభుత్వం అయన జీవిత కథాంశాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చి ఆయన్ను గౌరవించింది. తాజాగా అయన మండుటెండల్లో రహదారుల పక్కన ఉన్న కానుగా చెట్ల విత్తనాలను ఏరుకుంటూ కనిపించాడు. దానికి గల కారణం కూడా వివరించాడు...వర్షాలు కురిసే సమయంలో అడవుల్లో చల్లి అడవిని పచ్చగా మారుస్తాను అంటున్నాడు వనజీవి రామయ్య. అయితే ఇప్పటికే కోటి మొక్కలను నాటిన ఈయన మరో రెండు కోట్ల మొక్కలను నాటి పుడమిని పచ్చగా మారుస్తా అంటున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: