టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఏసీబీ అధికారులు స్పందించారు. ఆయనను విజయవాడ తీసుకొస్తున్నామని ఏసీబీ కోర్ట్ లో ఆయనను  ప్రవేశ పెడతామని పేర్కొన్నారు. దీనిపై విజిలెన్స్ దర్యాప్తు చేసింది అని తమకు నివేదిక ఇవ్వడంతోనే తాము అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ వివరించింది. 

 

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారు అని అధికారులు పేర్కొన్నారు. సీకే రమేష్ పేరుతో నకిలీ బిల్లులను కొనుగోలు చేసారు అని అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించారు అని అధికారులు వివరించారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ముగ్గురిని కోర్ట్ లో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. కాగా ఆయనను విశాఖ మీదుగా విజయవాడ తీసుకొస్తున్నారు ఏసీబీ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: