దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి ఎవరూ చేయలేని సాహసాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నారు.  ప్రాణాలకు తెగించి డాక్టర్లు రోగులకు వైద్య చికిత్స అందిస్తున్నారు. అలాంటి డాక్టర్లపై కొంత మంది రోగుల బంధువులు దారుణంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం గురించి పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినా.. అప్పటి వరకు ఏదో పరిష్కారం చూపుతున్నారని.. తమకు రక్షణ లేకుండా పోయిందని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా భారం తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు విధులకు వెళ్లేది లేదని జూడాలు స్పష్టం చేశారు.  

 

మంగళవారం రాత్రి నుంచి గాంధీలో జూడాలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు విధుల్లోకి వెళ్లడంలేదు. చర్చలు సఫలమని ప్రభుత్వమే ప్రకటించుకుందని, కానీ తామింకా సమ్మెలోనే ఉన్నామని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. సమ్మె నోటీసు ఇచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.

 

బుధవారం మంత్రి ఈటల వారితో చర్చలు జరిపారు. వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు.  సీఎం దృష్టికి జూడాల డిమాండ్లు తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని కోరారు. అయితే మంత్రి స్పష్టమైన  హామీ ఇవ్వకపోవడంతో తమ ఆందోళన కొనసాగుతుందని జూడాలు స్పష్టం చేశారు

 

మరింత సమాచారం తెలుసుకోండి: