మొన్ననే టీడీపీ సీనియర్ నేత అచ్చెన్న సర్జరీ చేయించుకున్నారని... సర్జరీ తరువాత ఇంట్లోనే అచ్చెన్నకు వైద్యం అందిస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అలాంటి స్థితిలో అర్దరాత్రి కిడ్నాప్ చేయడం నీచమైన చర్య అని ఆయన ఆరోపించారు. మందులు వేసుకోడానికి కూడా అనుమతించలేదన్నారు. సీఎం జగన్ శాడిజం పరాకాష్టకు చేరిందన్నారు.

 

చట్టవిరుద్దంగా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి కట్టుకథలు చెబుతున్నారని ఆరోపణలు చేసారు. జగన్ అవినీతిని ఎండగట్టినందుకే అచ్చెన్నపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అచ్చెన్నాయుడికి ఏమైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత అని స్పష్టం చేసారు. అర్ధరాత్రి వందల మందిని పంపి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది..? అని నిలదీశారు. అచ్చెన్నాయడు ఏమైనా ఉగ్రవాదా..? అచ్చెన్నాయుడి కంపెనీలకు గనులు 50 ఏళ్లకు లీజుకిచ్చారా..?  అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: