టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు.   ఇప్పటికే ఆయన జిల్లా నేతలు అందరితో మాట్లాడి అచ్చెన్న కుటుంబానికి అండగా ఉండాలి అని కూడా సూచించారు. అదే విధంగా  పార్టీ అగ్ర నేతలను అచ్చెన్న ఇంటికి వెళ్ళాలి అని కూడా సూచనలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 

 

ఇక ఇదిలా ఉంటే అచ్చెన్న కుటుంబ సభ్యులకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసారు. తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు చంద్రబాబు నాయుడు. అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది అని ఎవరూ కూడా భయపడవద్దు అని  ఆయన సూచించారు. జరిగిన ఘటనను ఆయనకు వివరించారు కుటుంబ సభ్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: