అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు దుర్మార్గమన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెఢ్డి భవానీ. ముఖ్యమంత్రి జగన్  కక్ష సాధింపుతో బలమైన బీసీ నేతను అక్రమంగా అరెస్టు చేయించారని ఈ సందర్భంగా ఆమె మండిపడ్డారు.  మా కుటుంబం గత 35  సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నామని ఆమె అన్నారు. 

 

మా కుటుంబంపై ఎప్పుడూ అవినీతి మచ్చ లేదన్నారు. అచ్చెన్నాయుడు అసెంబ్లీ సమావేశాల్లో జగన్ అవినీతిపై నిలదీస్తున్నందుకే కక్ష కట్టి అరెస్టు చేయించారని తీవ్ర ఆరోపణలు చేసారు ఆమె. సర్జరీ చేయించుకున్న అచ్చెన్నాయుడిని ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టు వ్యవహరించటం హేయమైన చర్య అని మండిపడ్డారు ఆమె. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలతో పాటు జగన్ ప్రభుత్వం అవినీతిపైనా నిలదీస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: