ఈ ఉదయం నుంచి ఏపిలో ఉత్తరాంధ్ర టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని ఏసీబీ అరెస్ట్ చేయడం చాలా హాట్ టాపిక్ గా మారింది.  అయితే ప్రతిపక్ష నేతలు ఇది దారుణం.. అన్యాయం అంటూ గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే.  కానీ అధికార పక్ష నాయకులు మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని.. చట్టానికి ఎవరూ అతీతులు కారని చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని ఏసీబీ అరెస్ట్ మంత్రి శంకరనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు ఈ ప్రభుత్వం మంచి చేస్తున్న విషయం తెలిసిందే.. దాంతో ప్రజలకు ఆయనపై మరింత అభిమానం గౌరవం పెరిగిపోతున్నాయి.

 

ఇది చూసి ఓర్వలేని ఓ అవినీతిపరుడు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశాడని, ఇప్పుడా అవినీతిపరుడు అరెస్ట్ అయితే కులం కార్డు అంటగట్టడం సిగ్గుచేటు అని అన్నారు. అచ్చెన్నాయుడు ఏమైనా మహాత్మా గాంధీనా, లేక పూలేనా అంటూ ఘాటుగా స్పందించారు. ఈఎస్ఐ సొమ్మును కాజేసిన వ్యక్తిని ఏమనాలి? అంటూ ప్రశ్నించారు. తమదాకా వస్తే కానీ ఏది అవినితి అన్న విషయం వీళ్లు గమనించకపోవడం మరీ దారుణం అని అన్నారు. అవినీతికి పాల్పడిన వాళ్లపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: