IHG

శుక్రవారం ఉదయం దాదాపు 7:30 ని. లకు తెలుగు దేశం పార్టీ మాజీ మంత్రి కింజారపు అచ్చన్నాయుడు ను ఏసీబీ అరెస్ట్ చేసింది. అయితే  దాదాపు 150 మంది అధికారులు ఈ అరెస్ట్ సమయంలో అయన ఇంటి ముందు మోహరించడం విశేషం. ఇఎస్ఐ కొనుగోళ్ల విషయంలో దాదాపు 150 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అధికారులు కేసు ఫైల్ చేసి అరెస్ట్ చెశారు. అయితే ఇప్పటికీ అచ్చెన్నను ఎక్కడ ఉంచారన్నది అధికారులు వెల్లడించలేదు. అయితే గత కొద్దిరోజులుగా అచ్చెన్నాయుడు శస్త్ర చికిత్స చేయించుకొని మందులు తీసుకుంటున్నాడు.అయితే అరెస్ట్ అయినా తరువాత ఆయనకు మందులు తీసుకొనే వెసులుబాటు ఇవ్వడం లేదంటూ టీడీపీ అధినేత చెంద్రబాబు మండిపడ్డారు.

 

 

అదేవిధంగా అచ్చెన్న కుటుంబానికి ఫోన్ ద్వారా విషయాలు అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్న కుటుంబానికి మేమున్నాం దిగులుపడొద్దని భరోసా ఇచ్చారు చంద్రబాబు. ఇదే విషయంపై లోకేష్ కూడా స్పందించారు. అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులూ మరియు ఇతర పార్టీ నాయకులూ కూడా ఈ విషయం పై స్పందించారు. అయితే అచ్చన్నాయుడు కుటుంబానికి అండగా ఉండాలంటూ చంద్రబాబు టీడీపీ నాయకులను కోరినట్టుకూడా తెలుస్తోంది. చంద్రబాబు లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లో ఉంటున్నవిషయం తెలిసిందే అయితే అచ్చెన్న అరెస్ట్ గురించి తెలుసుకున్న అయన హుటాహుటిన విజయవాడ బయలుదేరారు. ఆయనతోపాటు అయన కుమారుడు లోకేష్ కూడా పయనమయ్యారు. అచ్చెన్న అరెస్ట్ తో ఏపీ రాజకీయం మరింత వేడెక్కనుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: