మన దేశాలు సహనం గల దేశాలు కాబట్టే ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. భారత్-అమెరికా దేశాలకు సహనం గల దేశాలుగా గుర్తింపు ఉందనీ అయితే దురదృష్ట వశాత్తూ ప్రస్తుతం దాని తాలూకు డీఎన్‌ఏ వాటి నుంచి కనపడకుండా పోయిందని అన్నారు రాహుల్. హార్వార్డ్స్ కెన్నడీ స్కూల్ ప్రొఫెసర్, నాటో మాజీ రాయబారి నికోలస్ బర్న్స్‌తో ఆయన మాట్లాడారు. 

 

మా దేశం చాలా సహనం గల దేశమన్న ఆయన... మేము ఎలాంటి దాపరికం లేకుండా చాలా ఓపెన్‌గా ఉంటామన్నారు. కానీ దాని తాలూకు డీఎన్ఏ ఇప్పుడు మాయమైపోతోందని ఆయన పేర్కొన్నారు. నేను ఎప్పుడూ చూసే పరస్పర సహనపు స్థాయి ఇప్పుడు కనిపించడం లేదని చెప్పేందుకు బాధపడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: