భరత్ లో దాదాపుగా మూడు లక్షలకు చేరువగా కరోనా కేసులు నమోదువ్వుతున్నాయి. ఇప్పటివరకు 2 లక్షల  97 వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 8493  మరణాలు సంభవించాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు తెలంగాణాలో 4320 పాజిటివ్ కేసులు మరియు 165 పాజిటివ్ మరణాలు సంభవించాయి.ఈ  నమోదైన కేసులలో హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి.

 

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని లాక్ డౌన్ సడలింపులు తెలంగాణ ప్రభుత్వం అందిస్తూ ఉంది. అయితే సడలించిన లాక్ డౌన్ లో ప్రజలు గుంపులు గుంపులు గా మార్కెట్లకు మరియు దుకాణాలకు వెళుతున్నారు. దింతో కరోనా కేసులు విపరీతం గా పెరిగిపోతున్నాయి. అయితే ఈ పెరుగుతున్న కేసుల దృష్ట్యా తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో లాక్ డౌన్ తీవ్రతరం చేయాలనీ ఆలోచిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ లాక్ డౌన్ అమలుకు విధివిధానాలను వెల్లడించనున్నారు కేసీఆర్ ఫ్రభుత్వం. 

మరింత సమాచారం తెలుసుకోండి: