భారత్ లో కరోనా కేసుల తీవ్రత ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా కట్టడికి సంబంధించి ఎన్ని చర్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నా సరే అది మాత్రం ఆగడం లేదు అనే చెప్పాలి. ఇక ఇది పక్కన పెడితే తాజాగా వస్తున్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. 

 

దేశంలో కరోనా వైరస్ ఏ మాత్రం ఆగే అవకాశం లేదని కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నెలలో వచ్చే నెలలో దారుణంగా కేసుల పెరుగుదల అనేది ఉంటుంది అని ప్రజలు చాలా వరకు అప్రమత్తంగా లేకపోతే మాత్రం ఇబ్బంది కచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నారు. దేశంలో వచ్చే నెలలో పది లక్షల కేసులు ఉండే అవకాశం ఉంది అని  హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: