తెలుగుదేశం సీనియర్  నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సీఎం జగన్ మీద కీలక వ్యాఖ్యలు చేసారు.అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయని... ఇసుక,ల్యాండ్,వైన్ మాఫియా గుట్టు రట్టు చేస్తారనే భయంతో బీసీ నేత  అచ్చెన్నాయుడు ని అక్రమంగా అరెస్ట్ చేసారని ఆరోపించారు. ఇప్పడు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి జేసి కుటుంబాన్ని అరెస్ట్ చేసారు అని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసారు.

 

16 నెలలు జైలు జీవితం గడిపిన వైయస్ జగన్ అందర్నీ జైలు కి పంపాలని ఆశ పడుతున్నారు అని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా నియంతల కోరలు పీకడానికి అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉంది.అని అయ్యన్న అన్నారు.ఇలాంటి అరెస్టులు అక్రమ కేసులు పెట్టిన మేము వెనుకాడబోమని ప్రజలు తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: