ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల 30వ తేదీన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాల(ఆర్బీకే) ద్వారా బ్యాంకింగ్ సేవలను కల్పించనుంది. వ్యవసాయ శాఖ చేసిన ఈ ప్రతిపాదనకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఆమోదం తెలిపింది. అతి త్వరలో ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ రంగ నిపుణులు జగన్ సర్కార్ చిత్తశుద్ధికి ఈ ఆలోచన మరో తార్కాణం అని అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ నిర్ణయం అమలులోకి వస్తే బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందించేసేవలు ఆర్బీకేల్లోనే అందనున్నాయి. వీరు రైతులు, బ్యాంక్ బ్రాంచ్ ల మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. క్రెడిట్ కోసం దరఖాస్తు ఫారాలు నింపడానికి, రూపే కిసాన్ కార్డ్ జారీకి, కేంద్ర... రాష్ట్ర రైతు సంబంధిత పథకాలలో అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీరు సహాయపడతారు. రైతులకు బ్యాంకింగ్ సమస్యలు అన్నీ సులువుగా పరిష్కరించేందుకు ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: