దేశంలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా భారీన పడి మరణిస్తున్న వారిలో 20 నుంచి 30 శాతం మధుమేహ రోగులే ఉన్నారు. తాజాగా శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో కరోనా భారీన పడితే మధుమేహం వస్తుందని తేలింది. ఇప్పటివరకు డయాబెటిస్ జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్యంగా మాత్రమే వస్తుందని మనకు తెలుసు. తాజాగా న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన స్టడీలో అంతర్జాతీయ డయబెటీస్ నిపుణుల బృందం, మోనష్ యూనివర్శిటీకి చెందిన డయబెటీస్ ప్రొఫెసర్ పౌల్ జిమ్మెట్ కరోనా బాధితులపై చేసిన పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయని తేలింది. 
 
శాస్త్రవేత్తలు కరోనాకు, మధుమేహానికి సంబంధం ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారు. ఒకవైపు మధుమేహం ఉన్న వ్యక్తులకు ఈ వైరస్ మరింత ప్రమాదకారి కావడంతో పాటు వైరస్ సోకిన వ్యక్తులు కొత్తగా మధుమేహం భారీన పడుతున్నారు. కరోనా రాకముందు ఆరోగ్యంగా ఉన్న రోగుల్లో.. వైరస్ తర్వాత డయాబెటిస్ భారీన పడుతున్నట్లు తేలింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: