మా దేశంలో కరోనా వైరస్ లేదు అని భావిస్తున్న చైనాకు కరోనా చుక్కలు చూపిస్తుంది. అక్కడ భారీగా మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి అని అక్కడి అధికారులు చెప్తున్నారు. రాజధాని నగరం బీజింగ్ లో కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతుంది అని అధికారులు  మీడియాకు వివరించారు. దీనితో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ని విధించామని పేర్కొన్నారు.

 

ఏప్రిల్ 13వతేదీ తర్వాత రాజధాని నగరం బీజింగ్ లో ఆదివారం ఏకంగా 57 కరోనా కేసులు బయటపడ్డాయని ప్రభుత్వం పేర్కొంది. బీజింగ్ నగరంతో పాటుగా ఇతర ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి అని ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. అక్కడి అతి పెద్ద మార్కెట్ ని అధికారులు మూసి వేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: