టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయడంపై బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. ఆయనను అరెస్ట్ చేసిన విధానం ఆక్షేపణీయం అని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేసారు. ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని అంత దారుణంగా తీసుకెళతారా? అని ఆయన అధికారులను ప్రశ్నించారు. 

 

హడావిడిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన అధికారులను నిలదీశారు. అపారమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ట్రీట్ చేసే విధానం ఇదేనా? అని ఆయన మండిపడ్డారు. ఇది అత్యుత్సాహం కాకపోతే ఏంటి? అని నిలదీశారు. ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకే పోలీసులు అలా వ్యవహరించారని ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసారు. కాగా అచ్చెన్న గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: