ఉత్తరాఖండ్ లో కరోనా అదుపులోకి వచ్చినట్టే వచ్చి వేగంగా కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నా సరే కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు అనే చెప్పాలి. ఇక తాజాగా మరోసారి అక్కడ భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

ఈ రోజు ఉత్తరాఖండ్‌లో మరో 31 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 1816 కు చేరుకుంది. ఇందులో 705 క్రియాశీల కేసులు ఉన్నాయని 1078 మంది  డిశ్చార్జ్ అయ్యారు అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 24 మంది రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించారు. ఇక అక్కడ మాస్క్ లేకపోతే ఆరు నెలల జైలు శిక్ష అని ప్రభుత్వం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: