తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరిక్షల వేగాన్ని పెంచాలి అని నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటి వరకు పరిక్షల విషయంలో చూసి చూడనట్టు  రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనే ఆరోపణలను తిప్పి కొడుతూ దాదాపు అన్ని జిల్లాల్లో కూడా కరోనా పరీక్షలను వేగవంతం చెయ్యాలి అని సిఎం కేసీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. 

 

కరోనా పరిక్షల విషయంలో ఇక విమర్శలు రానీయకుండా భారీగా పరిక్షలు చెయ్యాలి అని దాదాపు 15 రోజుల్లో లక్ష వరకు పరిక్షలు నిర్వహించాలి అని కేసీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీనితో ఇక అధికారులు చిన్న చిన్న లక్షణాలు ఉన్న వారికి కూడా పూర్తి స్థాయిలో పరిక్షలు చెయ్యాలి అని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: