కరోనా దెబ్బకు ముంబై షేక్ అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ని ఎదుర్కోవడం ఎలాగో మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇక కరోనా దెబ్బకు ముంబై, థానే నగరాల్లోని మూడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలను తాత్కాలికంగా మూసి వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 

 

ఎస్బీఐ లో పని చేస్తున్న మొత్తం 8 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. థానే నగరంలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ లో 25 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అందులో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. దీనితో బ్రాంచ్ ని మూసి వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: