తెలంగాణాలో ఇప్పుడు పులులే అనుకుంటే కృష్ణ జింకలు కూడా ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో  ఇప్పుడు జింక ల సందడి ఎక్కువగా ఉంది. కృష్ణ జింక లు ఇప్పుడు నారాయణపేట్ జిల్లాలోని పంట పొలాలను నాశనం చేస్తున్నాయి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇవి అన్ని మహారాష్ట్ర నుంచి వచ్చాయి అని తమ పంటలను నాశనం చేస్తున్నాయి అని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు వేలల్లో కృష్ణ జింకలు వచ్చేస్తున్నాయి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదోక విధంగా చర్యలు చేపట్టి వాటిని అదుపు చెయ్యాలి అని లేకపోతే తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది అని అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: