ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని విశాఖ జిల్లాను కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. జిల్లాలో ఇప్పటికే పోలీసులు కరోనా భారీన పడగా తాజాగా వైద్యులకు కూడా వైరస్ నిర్ధారణ అయింది. తాజాగా కేజీహెచ్ లోని మార్చురీలో పని చేస్తున్న పోస్టుమార్టం సిబ్బందికి కరోనా నిర్ధారణ అయింది. ఇద్దరు వైద్య విద్యార్థులు కరోనా భారీన పడ్డారు. 
 
దీంతో కేజీహెచ్ లోని మార్చురీని తాత్కాలికంగా మూసివేశారు. కేజీహెచ్ వైద్యుడు కరోనా భారీన పడటంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు ఆస్పత్రి పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు. జిల్లాలో వైద్యులకు కూడా కరోనా సోకుతూ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: