దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఆర్.టీ పీసీఆర్ విధానం ద్వారా దేశంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ విధానం ద్వారా కరోనాను నిర్ధారించటానికి గంటల సమయం పడుతోంది. తాజాగా ఐ.ఎం.సీ.ఆర్, ఎయిమ్స్ యాంటీజెన్ టెస్ట్ కిట్ ఫలితాలను ధ్రువీకరించింది. దక్షిణకొరియాకు చెందిన ఈ టెస్ట్ కిట్ ద్వారా అరగంటలో కరోనా ఫలితం తేలనుంది. 
 
ఈ విధానం ద్వారా పాజిటివ్ నిర్ధారణ అయితే మాత్రమే దానిని పాజిటివ్ గా నిర్ధారిస్తున్నారు. ఈ పరీక్షలో నెగిటివ్ వస్తే నిర్ధారణ కోసం ఆర్.టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచిస్తోంది. ఐ.సీ.ఎం.ఆర్ మార్గదర్శకాల్లో ఈ మేరకు స్పష్టం చేసింది. అధికారులు ఈ విధానం ద్వారా కరోనా సోకిందో లేదో వేగంగా నిర్ధారించవచ్చని... ఈ టెస్ట్ కిట్ల వల్ల ప్రజలకు మరింత ప్రయోజనం కలగనుందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: