ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలు వచ్చేసిన నేపధ్యంలో ఇప్పుడు తెలంగాణాలో కూడా ఇంటర్ ఫలితాల కోసం విద్యార్ధులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణా విద్యాశాఖ ఎప్పుడు విడుదల చేస్తుందా అనే ఆసక్తి జనాలకు ఉంది. ఇక ఇదిలా ఉంటే తెలంగాణా విద్యాశాఖ ఈ నెల 18 న ఇంటర్ ఫలితాలను విడుదల చేయడానికి గానూ సన్నాహలు చేస్తుంది. 

 

ప్రశ్నపత్రాల మూల్యాంకనం గత నెలాఖరులోనే పూర్తి కాగా స్కానింగ్‌తో పాటుగా... ఇతర పాలనపరమైన ఏర్పాట్లన్నీ కూడా రెండు రోజుల క్రితమే పూర్తి చేసారు. ఇక గత ఏడాది వచ్చిన సమస్యలు రాకుండా ఈ ఏడాది ఫలితాలను పూర్తి చేయనున్నారు అధికారులు. ఈ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: