ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. తెల్ల రేషన్‌ కార్డులు బియ్యం కార్డులుగా మార్చే క్రమంలో ఈకేవైసీ కోసం గానూ... ఐదేళ్లలోపు పిల్లలకు వేలిముద్రలు అక్కర్లేదని తెలిపింది. ఈ మేరకు విశాఖ రూరల్‌ డీఎస్‌వో రొంగలి శివప్రసాద్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. ఐదేళ్లలోపు పిల్లల వేలిముద్రలు ఈకేవైసీ మిషన్‌ తీసుకోనందున తల్లిదండ్రులు డిక్లరేషన్‌ ఇస్తే సరిపోతుందని ఆయన ప్రజలకు సూచించారు. 

 

కార్డులో ఉన్న వ్యక్తి చనిపోతే ఇంటి యజమాని సమాచారం ఇస్తే కచ్చితంగా మృతుని వివరాలు తొలగిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. బియ్యం కార్డులకు సంబంధించి గ్రామ సచివాలయాన్ని సంప్రదించాలీ అంటూ ఆయన సూచనలు చేసారు. ఏపీలో రేషన్ కార్డుల జారీని సర్కార్ వేగవంతం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: