దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ రోజు కూడా 11 వేల కేసులు నమోదు అవుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది దేశంలో అని చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా కేసులు ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. 

 

దానికి కారణం వర్షా కాలం అని.. వర్షా కాలంలో ఇప్పుడు కేసుల తీవ్రత పెరుగుతుంది అని ఎవరికి కరోనా పరిక్షలు నిర్వహించాలో అర్ధం కాని పరిస్థితి ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రజలు సీజనల్ వ్యాధుల విషయంలో ఇప్పుడు అసలు అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్నారు. లేదు అంటే మాత్రం ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: