ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాల నేపధ్యంలో ఉదయం గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చంద్  ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. మూడు రాజధానులను కచ్చితంగా నిర్మిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. 

 

శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది అని ఆయన అన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖ ఉంటుంది అని న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది అని ఆయన అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మూడు రాజదానులకు సంబంధించి చట్టబద్దమైన ప్రక్రియ కొనసాగుతుందని అది తమ ఉద్దేశమని అన్నారు. మూడు రాజదానులకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు ఆయన. అభివృద్ధి వికేంద్రీకరణ కు పరిపాలన వికేంద్రీకరణ మంత్రం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: