నేడు ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఏపి ప్రజలు అసెంబ్లీ ఎలా కొనసాగుతుందా అని ఉత్కంఠతతో చూస్తున్నారు.  ఇప్పటికే గవర్నర్ ఏపి గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రసంగం పూర్తయ్యింది. ఇక ప్రతిపక్ష నేతలు నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్లారు.  ఈ నేపథ్యంలోమ  ఆంధ్రప్రదేశ్ లో విపక్షం గొంతు నొక్కేస్తున్నారని, తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపిస్తూ, ఈ ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది.

 

ఉదయం నల్ల చొక్కాలను ధరించి అసెంబ్లీకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత, జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నల్ల చొక్కా వేసుకున్న ఫొటోను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోస్ట్ చేసి విమర్శలు గుప్పించారు. నల్ల ధనం మీద విచారణ వద్దని నల్ల చొక్కా వేసుకున్నావా? నాయుడూ వాటే కలర్‌సెన్స్!' అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. కాగా, ఏడాది కాలంగా ఏపీలో ప్రభుత్వ తీరుకి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు నల్లచొక్కాలు వేసుకుని ఈ రోజు పలు ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: