ఏపీ సీఎం వైయస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. 2.25 లక్షల కోట్ల రూపాయలతో ప్రభుత్వం రూపొందించింది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ లో డాక్టర్‌ వైఎస్సార్‌‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. 
 
వడ్డీ లేని రుణాల కోసం రూ.1100 కోట్లు కేటాయించింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ ప్రవేశపెడుతుండగా రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లుగా మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లుగా ఉంది. అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో‌ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. అన్నిరకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు అని మంత్రి చెప్పారు. పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: