ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. నేడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా బడ్జెట్ లో సంక్షేమానికి అదే విధంగా విద్య వైద్య రంగానికి వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసారు. ఇక ఇదిలా ఉంటే... 

 

సభలో సిఎం జగన్ అలా రెండు నిమిషాలు వెనక్కు ఆనుకుని కునుకు తీసారు... ఈ సందర్భంగా ఒక చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో ఆరోపణలు చేసారు. ఇంట్లో పబ్జీ అసెంబ్లీ లో లాలీ జో అంటూ ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: