ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఇప్పుడు సిఆర్డీఏ బిల్లుని రాజధాని వికేంద్రీకరణ బిల్లుని ప్రవేశ పెట్టడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. సిఎం జగన్ చేస్తున్న ఈ పని ఏ మాత్రం ఆమోద యోగ్యం కాదని మండిపడుతున్నాయి విపక్షాలు. ఇక దీనిపై తాజాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గజినీ మహమ్మద్‌లా మారారని ఆయన ఆరోపణలు చేసారు. 

 

సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను మళ్లీ సభలో ప్రవేశపెట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఆ బిల్లులను మండలి చైర్మన్ ఇప్పటికే సెలెక్ట్ కమిటీకి సిఫార్స్ చేశారన్న ఆయన... శాసనమండలిలో తిరస్కరణకు గురైన బిల్లులను, హైకోర్టు తప్పు పట్టిన పలు వివాదాస్పద అంశాలను అమలు చేసేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు చేసారు ఆయన. కరోనా విపత్తు నేపథ్యంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: