నేడు రేపు విశాఖ ఏజెన్సీ లో బంద్ జరగనుంది. షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు వంద శాతం స్థానిక గిరిజనులకు చెందేలా గతంలో ప్రభుత్వం జారీచేసిన జీవో-3ను సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని నిరసిస్తూ మంగళ, బుధవారాల్లో ‘48 గంటల బంద్‌’కు ఆదివాసీ హక్కులు, చట్టాల పరిరక్షణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (ఆదివాసీ జేఏసీ) పిలుపునిచ్చారు. 

 

ఈ మన్యం బంద్‌కు గానూ విపక్షాలు, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు  ప్రకటించాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరు కూడా విజయవంతం చెయ్యాలి అని పలువురు విపక్షాల నేతలు పిలుపునిచ్చారు. జీవో-3ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తీర్పు వెలువడేంత వరకు ఉద్యోగాల విషయంలో గిరిజనులు నష్టపోకుండా ఉండేందుకు గానూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తక్షణమే ఆర్డినెన్సు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: