ఎప్పటికప్పుడు తన యాప్స్ లో కొత్త అప్డేట్ తో దూసుకుపోతూ ఉంటుంది గూగుల్. ప్రతీ యాప్ ని కూడా ఏదోక విధంగా అభివృద్ధి చేస్తూ వినియోగదారులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా మరో అప్డేట్ ని తీసుకొచ్చింది గూగుల్. గూగుల్ తన వీడియో చాట్ సర్వీస్ ని ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌లలోని జిమెయిల్‌కు తీసుకువస్తున్నట్లు ప్రకటించింది,

 

ప్రజలు ప్రయాణంలో ఉన్నప్పుడు వారి ఇన్‌బాక్స్ నుండి వీడియో సమావేశాలలో సులభంగా పాల్గొనవచ్చు అని ప్రకటించింది. రాబోయే వారాల్లో, గూగుల్ వినియోగదారులు ఫోన్ యాప్ లో ఈ కొత్త మీట్ ట్యాబు ని చూడవచ్చు అని పేర్కొంది. ఇక అక్కడ గూగుల్ క్యాలెండర్‌లో షెడ్యూల్ చేయబోయే సమావేశాలను చూడవచ్చని చెప్పింది. ఇది అంతా ఒకే ట్యాప్ లో ఉంటుందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: