వ్యక్తులపై అభిమానం ఉండవొచ్చు కానీ.. అది ప్రాణాలు తీసుకునేంతగా ఉండకూడదని అంటారు.  ప్రముఖ సినీ కళాకారులు, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారికి వీరాభిమానులు ఉంటారు. తమ అభిమాన హీరో, రాజకీయ నేతలు చనిపోతే తట్టుకోలేక మనస్థాపంతో చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా నా హీరో ఆత్మ‌హత్య చేసుకోగా లేనిది నేను చేసుకోలేనా  అంటూ ఆత్మహత్య లేఖ రాసి ఓ అభిమాని సూసైడ్‌ చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో చోటు చేసుకుంది.  బాలీవుడ్ నటుడు  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని సినీ పరిశ్రమలు కన్నీటి పర్యంతం అయ్యాయి.

 

కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి... బుల్లితెరపై సత్తా చాటి వెండి తెరపై వెలిగిపోతూ ఉన్నట్టుండి ఆరిపోయాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. సుశాంత్‌కి బరేలికి చెందిన ఓ పదో తరగతి విద్యార్థి వీరాభిమాని ఉన్నాడు.. అతని మూవీస్ అంటే తెగ పిచ్చి.  సుశాంత్ మృతిచెందడంతో ఆ విద్యార్థి తట్టుకోలేకపోయాడు.

 

తన హీరోలేని జీవితం తనకు వద్దని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య లేఖ రాసి చివరకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అభిమానం ఉండొచ్చు కానీ కన్నవారి ప్రేమను కూడా గుర్తు పెట్టుకోవాలని.. ఇలాంటి పనులు చేయొద్దని సెలబ్రెటీలు కోరుతున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: