తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో హైకోర్టు ఆస్పత్రిలో మరణించిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై కేసీఆర్ సర్కార్ సుప్రీంలో సవాల్ చేసింది. ప్రభుత్వం తరపు న్యాయవాది అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని కోర్టుకు తెలిపారు. 
 
ఐ.సీ.ఎం.ఆర్, వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలను అనుసరించి పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుతం వాదనలను సుప్రీం పరిగణనలోకి తీసుకుని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించి విచారణను 14 రోజుల పాటు వాయిదా వేసింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: