కరోనా నియంత్రణ విషయంలో తెలంగాణా సర్కార్ తీరుపై రాష్ట్ర హైకోర్ట్ మండిపడింది. కరోనా చికిత్సలను అసలు గాంధీ ఆస్పత్రికే ఎందుకు పరిమితం చేసారని హైకోర్ట్ నిలదీసింది. గాంధీ లో జూడాలు సమ్మె చేయడమే అక్కడి పరిస్థితికి అద్దం పడుతుందని పేర్కొంది. కరోనా నియంత్రణపై ప్రభుత్వానికి ఆసక్తి ఉత్సాహం పోయాయి అంటూ వ్యాఖ్యలు చేసింది హైకోర్ట్. తమ ఆదేశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వ్యాఖ్యానించింది.

 

పరిక్షలు తక్కువగా చేస్తే అసలు కరోనా వ్యాప్తి ఏ విధంగా తగ్గుతుందని మండిపడింది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గాంధీ సూపరిండెంట్ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని హైకోర్ట్ పేర్కొంది. ప్రభుత్వా ఆస్పత్రుల్లో సౌకర్యాలను పెంచాలి అని మూడు వారాలుగా చెప్తున్నామని హైకోర్ట్ పేర్కొంది. మరింత కఠినం గా ఉండాలి అని కోరుకుంటే ఇక నుంచి అలాగే ఉంటామని హైకోర్ట్ వ్యాఖ్యలు చేసింది. నిమ్స్ లో కరోనా చికిత్స ఎందుకు చేయడం లేదని నిలదీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: