ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ నెలలో అమలు చేసిన వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ఈ సంవత్సరం జూన్ నెలలోనే అమలు చేయనున్నారు. రాష్టంలో కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల గురించి ఇప్పటికే సర్వే చేయించింది. 
 
ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసింది. అసెంబ్లీ సమావేశాల కారణంగా ఈ నెల 17వ తేదీన అందించాల్సిన ఆర్థిక సాయం ఈ నెల 20వ తేదీన అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మగ్గాలను నమ్ముకుని జీవిస్తున్న వారికి ప్రభుత్వం ఏడాదికి రూ.24,000 ఆర్థిక సాయం అందించి ముడి సరుకు, ఇతర అవసరాలకు ఉపయోగించుకునే విధంగా సహాయపడుతోంది. ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా చేనేత కార్మికుల ఖాతాలలో నగదు జమ చేయనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: