ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా పరీక్షల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్రంలో నిన్నటివరకు 5,98,474 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి. గత 24 గంటల్లో జరిగిన కరోనా పరీక్షలతో జగన్ సర్కార్ ఆరు లక్షల మార్కును అందుకుంది. ఈ నెల 11వ తేదీన 5వ లక్షల మార్కును అందుకున్న ఏపీ వారం రోజుల్లోనే లక్ష మందికి కరోనా పరీక్షలు నిర్వహించడం గమనార్హం. రాష్ట్రంలో ఒక మిలియన్ జనాభాకు 11,207 మందికి పరీక్షలు నిర్వహించి ఏపీ అగ్రస్థానంలో నిలుస్తోంది. 
 
రాష్ట్రంలో గత 24 గంటల్లో 351 కొత్త కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 7,071కి చేరింది. ఇందులో 5,555 కేసులు ఏపీకి చెందినవి కావడం గమనార్హం. రాష్ట్రంలో కరోనా భారీన పడి ఇద్దరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 90కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,641 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా ప్రస్తుతం 3,330 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: