దేశంలో వైరస్ విజృంభణ వల్ల మాస్కులకు డిమాండ్ పెరిగింది. రకరకాల పేర్లలో ప్రజలకు మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మాస్కులు కేవలం గాలిలో లేదా ఇతరుల దగ్గు, తుమ్ము, తుంపర్ల ద్వారా వచ్చే వైరస్‌లు నేరుగా మన నోటిలోకి, ముక్కులోకి చేరకుండా అడ్డుకోవడానికి మాత్రమే సహాయపడతాయి. అయితే ఈ మాస్కులు వాడినా వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయి. కానీ స్విట్జర్లాండ్‌ కేంద్రంగా పనిచేస్తున్న లివింగ్‌గార్డ్‌ తయారుచేసిన మాస్కు మాత్రం ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన మాస్కులతో పోలిస్తే భిన్నమైంది. 
 
మూడు పొరలతో సిద్ధమైన ఈ మాస్కును ప్రత్యేకమైన వస్త్రం, కొన్ని రసాయనాలతో సిద్ధం చేశారు. మాస్కుపై నిత్యం 0.1 నుంచి 0.8 మిల్లీవోల్టుల ధనాత్మక విద్యుదావేశం పుడుతూ ఉంటుంది. సూక్ష్మజీవులు రుణాత్మక ఆవేశాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వైరస్‌ మాత్రమే కాకుండా బ్యాక్టీరియా, శిలీంధ్రాలు సులభంగా నశిస్తాయి. మాస్కును తాకిన సూక్ష్మజీవులు అక్కడికక్కడే మరణిస్తాయి. ఈ మాస్కులని ఉతుక్కుని తిరిగి వినియోగించుకోవచ్చు. 
 
లివింగ్‌గార్డ్‌ సంస్థ మొత్తం మూడు రకాల మాస్కులను తయారు చేయగా వీటి ధర 1500 - 2000 రూపాయల మధ్య ఉంటుందని తెలుస్తోంది. 3 పొరలు ఉండే ఈ మాస్కు ద్వారా 5 రకాల రక్షణ లభిస్తుందని.... 210 రోజుల పాటు ఈ మాస్కును వాడవచ్చని సమాచారం. వారం రోజుల్లో లివింగ్ గార్డ్ కంపెనీ ఆన్ లైన్ లో ఈ మాస్కులను అందుబాటులోకి తీసుకురానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: