తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఘనంగా చేసుకునే సంప్రదాయ బోనాల ఉత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతాయి. చారిత్రక గోల్కొండ కోటపై గల శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 23 వరకు జరగనున్నాయి అని అధికారులు  తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అధికారులు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేసారు. 

 

మొదటి రోజు పూజ కోసం లంగర్‌హౌజ్‌ చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపు ఉంటుంది. చిన్న బజారు నుంచి అమ్మవారి ఊరేగింపు ఉంటుందని తెలిపారు. అయితే ఇందులో ప్రజలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేసారు. దేవాదాయ ఉద్యోగులు, ఆల య పూజారులు మాత్రమే పాల్గొంటారని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: