దేశ వ్యాప్తంగా వలస కార్మికులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతీ రోజు కూడా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతునే ఉన్నారు మన దేశంలో.

 

 ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కేంద్రం వారి కోసం కొత్త కార్యక్రమాలు ప్రవేశ పెడుతుంది. తాజాగా గ్రామీణ భారతదేశంలో జీవనోపాధి అవకాశాలను పెంచడానికి గానూ ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 20 న 'గారిబ్ కల్యాణ్ రోజ్గర్ అభియాన్' ను ప్రారంభించనున్నారు. 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాలలో 125 రోజుల పాటు ఈ పథకం అమలు చేస్తారు. వలస కార్మికుల కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది అని ప్రధాని కార్యాలయం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: