వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మండలిలో జరిగిన ఘటన దారుణమని అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవడంతో జీతాలకు కష్టం అవుతుందని వ్యాఖ్యలు చేశారు. సంఖ్యా బలం ఉందని టీడీపీ బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. మేం మాట్లాడిన మాటలను వక్రీకరించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్ధరాత్రి వరకు సమావేశాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. 
 
టీడీపీ సభ్యులు మండలిలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని చెప్పారు. సాక్షాత్తూ యనమల విధ్వంసం సృష్టిస్తున్నట్లు మాట్లాడారని వ్యాఖ్యలు చేశారు. వీడియోలు తీయొద్దని చెప్పినందుకు వెల్లంపల్లిపై దాడి జరిగిందని అన్నారు. ద్రవ్య వినిమియ బిల్లును అడ్డుకుని టీడీపీ ఎమ్మెల్సీలు చరిత్రహీనులుగా మిగిలిపోయారని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: