తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 9,65,839 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్టియర్ పరీక్షలకు 4,80,516 మంది హాజరు కాగా సెకండియర్ విద్యార్థులు 4,85,323 మంది హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల్లో 68.86 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. 
 
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా అని తెలిపారు. జిల్లాల వారిగా పరిశీలిస్తే కొమరం భీం అసిఫాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో 76 శాతంలో ఉందని... మేడ్చల్ తరువాత స్థానంలో ఉందని తెలిపారు. ఇంటర్ సెకండియర్ లో బాలికలు 75 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 62 శాతం ఉత్తీర్ణత సాధించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: