తెలంగాణ లో కరోనా కేసుల విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆ రాష్ట్ర హైకోర్ట్ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసింది. కరోనా కీలక సమాచారం అనేది మీడియా బులిటెన్ లో ఉండాలి అని స్పష్టం చేసింది హైకోర్ట్. ఐసిఎంఆర్ సూచనలను పాటించాలి అని స్పష్టం చేసింది హైకోర్ట్. గాంధీ ఆస్పత్రి తో పాటుగా 54 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతున్నాయి అని ప్రచారం చెయ్యాలి అని హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

 

ఐసిఎంఆర్ మార్గదర్శకాలను ఎందుకు పాటించడం లేదు అని హైకోర్ట్ నిలదీసింది. గాంధీ ఆస్పత్రి తరహా షిఫ్ట్ వారీ విధానం ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఉండాలి అని స్పష్టం చేసింది. తెలంగాణాలో కరోనా పరిక్షల సంఖ్యను పెంచాలి అని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: