చైనా భారత్ సరిహద్దుల్లో ఉన్న లడక్ లో ఇప్పుడు కాస్త ఉద్రిక్త వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. చైనా విషయంలో ఇప్పుడు ఈ ప్రాంతమే చాలా కీలకం. ఇక ఇప్పుడు దాడులు జరిగిన నేపధ్యంలో లడక్ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేసారు. లడక్ బీజేపీ ఎంపీ జమ్‌యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

 

పాకిస్థాన్ చైనాకు ఇచ్చిన అక్సాయ్ చిన్ భారత్‌దని, చైనా నుంచి దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆయన సూచించారు. గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతాలన్నీ లడక్‌లో భాగమన్నారు ఆయన. ప్రస్తుత భారత్ 1962 నాటిది కాదని ఇప్పుడున్నది 2020 భారత్ అని నామ్‌గ్యాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. లడక్‌లోని సరిహద్దుల్లో జీవించే స్థానికులు, గొర్రెల కాపరులు సరిహద్దును కాపాడుకునే విషయంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు ఆయన తమ పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న చైనా నుంచి తమ భూభాగాలను తిరిగి రాబట్టుకోవాలని సూచనలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: