లడక్ విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధి కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ మన జవాన్లను ఆయుధాలు లేకుండానే రంగంలోకి దింపారన్నారు. అందుకే వారు అమరులయ్యారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. దీనిపై బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రో మండిపడ్డారు. 

 

20 మంది జవాన్లను చైనా పొట్టనపెట్టుకున్న ఈ తరుణంలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం రాహూల్ నిర్లక్ష్యపూరిత వైఖరికి నిదర్శమని ఆరోపించారు. ఓ ఎంపీ అయి ఉండి కూడా రాహూల్ గాంధీ భాద్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. చైనా దురాగతంపైనే ప్రత్యేకంగా ప్రధాని మోదీ శుక్రవారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారనీ.. కనీసం అప్పటి వరకైనా రాహూల్ సంయమనం పాటించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలను చైనా వాడుకుంటుంది అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: