ఇప్పుడు అంతరాష్ట్ర రవాణా విషయంలో తెలంగాణా ఆంధ్రప్రదేశ్ తీసుకునే నిర్ణయం ఏంటీ అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వీసులను నడిపే ఉద్దేశం ఉందా లేదా అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం అయ్యారు. 

 

అంతర్రాష్ట్ర సర్వీసులకి సంబంధించి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు నిర్ణయం ప్రకటిస్తారు. ఏపీఎస్ఆర్టీసీ అధికారుల ముందు తెలంగాణ ఆర్టీసీ అధికారులు తమ ఆలోచనలు తెలంగాణా అధికారులతో పంచుకున్నారు. ఏపీ నుంచి ఎన్ని బస్సులు వస్తాయి ఎక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంది అనే దాని మీద తెలంగాణకు వివరించారు. అదే విధంగా తెలంగాణా కూడా వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: