తమిళనాడు లో  కరోనా కేసులు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేయడానికి గానూ ఎన్ని చర్యలు చేపట్టినా సరే ఫలితం ఉండటం లేదు అనే చెప్పాలి. దీనితో చెన్నై సహా  పలు జిల్లాల్లో లాక్ డౌన్ ని ప్రకటించారు. నాలుగు జిల్లాల్లో నేటి నుంచి లాక్ డౌన్ ని అమలు చేస్తుంది అక్కడి ప్రభుత్వం. 

 

తమిళనాడులో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోని 4 జిల్లాల్లో - చెన్నైతో పాటు దాని పొరుగు జిల్లాలైన చెంగల్‌పేట్, కాంచీపురం & తిరువల్లూరులలో జూన్ 30 వరకు లాక్డౌన్ విధించగా... జనాలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. చెన్నైలో ఎప్పుడు జనాలతో బిజీ గా ఉండే ఎన్‌ఎస్‌కె నగర్ (అన్నా ఆర్చ్) ప్రాంతంలో అసలు జనాలు ఎవరూ బయట కనపడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: