ఏపీలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్య‌స‌భ స్థానాల‌కు ఈ రోజు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌. ఎన్నిక‌ల పోలింగ్ ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతుంది. 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌రుగుతుంది. వైసీపీ త‌ర‌పున రాజ్యసభకు ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని, మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు పోటీలో ఉండగా టీడీపీ తర‌ఫున వర్ల రామయ్య బరిలో నిలిచారు. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా 2 గంటల్లోపే ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. 

 

రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓపెన్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు.రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓటును బీసీ వర్గానికి చెందిన పార్టీ రాజ్యసభ అభ్యర్థి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు కేటాయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వయంగా దీన్ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: