చెన్నై సహా నాలుగు జిల్లాల్లో  కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు అక్కడ లాక్ డౌన్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అక్కడ లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తుంది అక్కడి సర్కార్. పోలీసు బలగాలు నాలుగు జిల్లాల్లో భారీగా మొహరించాయి. ప్రజలను అసలు ఎక్కడా కూడా బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. 

 

మొత్తం నాలుగు జిల్లాల్లో కూడా పోలీసులు డ్రోన్ సహా పెట్రోలింగ్ తో ప్రజలను బయటకు రానీయకుండా కట్టడి చేస్తున్నారు. ఏ మాత్రం కూడా షాపులను అసలు ఓపెన్ చేయనివ్వడం లేదు. మరో 11 రోజులు ఈ లాక్ డౌన్ ఇలాగే కొనసాగిస్తామని ప్రజలు బయటకు వస్తే కఠిన చర్యలు అమలు చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: