దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రముఖుల మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఆర్థిక వేత్త బి పి విఠల్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందారు. ఈరోజు ఉదయం బంజారాహిల్స్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు కోలుకోలేక ఆయన మరణించారు. విఠల్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందినవారు. 1950 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన విఠల్ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సుధీర్ఘ కాలం పని చేశారు. 
 
ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శిగా, ఐ.ఎం.ఎఫ్. సలహాదారుగా, పదో ఆర్థిక సంఘం సభ్యునిగా, మాజీ ప్రధాని మన్మోహన్ దగ్గర సలహాదారుగా విఠల్ పని చేశారు. సెస్ ఏర్పాటులోను విఠల్ కీలక పాత్ర పోషించారు. ఆయన మరణ వార్త తెలిసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: